బార్డర్ జిల్లాల్లో మద్యం సేల్స్​పై ఏపీ ఎఫెక్ట్.. 2024లో రూ. 200 కోట్లు తగ్గిన సేల్స్

బార్డర్ జిల్లాల్లో మద్యం సేల్స్​పై ఏపీ ఎఫెక్ట్.. 2024లో రూ. 200 కోట్లు తగ్గిన సేల్స్
  • ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాల్లో ఈ ఏడాది తగ్గిన అమ్మకాలు
  • ఏపీలో బ్రాండెడ్ లిక్కర్ రేట్లు తగ్గించిన కొత్త సర్కార్
  • తెలంగాణలోని సరిహద్దు జిల్లావైన్ షాపులకు తగ్గిన గిరాకీ ​  
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే రూ.36 కోట్ల మేరకు తగ్గిన సేల్స్ ​
  • ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ ప్రభావం

ఖమ్మం, వెలుగు: మన రాష్ట్రంలో సరిహద్దు జిల్లాల్లోని వైన్ షాపులపై ఆంధ్రప్రదేశ్ ప్రభావం గట్టిగా పడింది. గతేడాదితో పోలిస్తే బార్డర్ షాపుల్లో ఈ సారి న్యూఇయర్ హంగామా కనిపించడం లేదు. ఇప్పటికే లిక్కర్ డిపోల నుంచి స్టాక్ తెప్పించుకున్న వైన్ షాపుల యజమానులు, ఆశించినంతగా అమ్మకాలు లేకపోవడంతో డీలాపడ్డారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేయడం, బ్రాండెడ్ లిక్కర్ ను అక్కడి షాపుల్లో అందుబాటులోకి తేవడం, రేట్లు కూడా తగ్గించడం వంటి కారణాలతో మన రాష్ట్రంలో అమ్మకాలపై ప్రభావం కనిపిస్తోంది. గత నాలుగేళ్లుగా ఏపీలో బ్రాండెడ్ లిక్కర్ అందుబాటులో లేకపోవడంతో ఏపీ నుంచి వచ్చి మన బార్డర్ షాపుల్లో స్టాక్ కొనుక్కొని తీసుకెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఆదాయంపై ఎఫెక్ట్ పడింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మద్యం తాగే వాళ్ల సంఖ్య పూర్తిగా తగ్గడంతోపాటు ఇక్కడి నుంచి సీక్రెట్ గా మద్యం తీసుకెళ్లే వారు కూడా ఇప్పుడు కరువయ్యారు. ఏపీలో చీప్ లిక్కర్ రేటును తగ్గించి క్వార్టర్ ను రూ.99కే అందుబాటులోకి తేవడం, బ్రాండెడ్ మద్యం క్వార్టర్ బాటిళ్లపై కనీసం రూ.30 వరకు రేట్లు తగ్గించడంతో గత మూడు, నాలుగేళ్లుగా వీకెండ్ లో జాతరను తలపించిన మన రాష్ట్రంలోని బార్డర్ వైన్ షాపులు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.  

ఏపీలో సర్కారు మారడంతో తగ్గిన ధరలు.. 

ఏపీ ప్రభుత్వం అక్టోబర్ లో కొత్త మద్యం పాలసీ తెచ్చింది. అప్పటి నుంచే క్రమంగా మన బార్డర్ షాపులపై ఎఫెక్ట్ మొదలైంది. రెండు వారాల క్రితం11 లిక్కర్ కంపెనీలు మద్యం ధరలను తగ్గించాయి. ఉదాహరణకు మ్యాన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్ బ్రాండ్ క్వార్టర్ ధర 2019లో రూ.110 ఉండగా, తర్వాత ఒకేసారి రూ.300కు పెంచారు. దీనిపై విమర్శలు రావడంతో రూ.220కి తగ్గించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇటీవల క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. ఇందులో హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.440 ఉండగా రూ.380కి, ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గింది. రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్కీ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.230 నుంచి రూ.210కి తగ్గింది. ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గింది. యాంటిక్విటీ విస్కీ ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.1,600 నుంచి రూ.1,400కు తగ్గింది. ఇలా ఏపీలో బ్రాండెడ్ మద్యం రెండు నెలలుగా అందుబాటులోకి రావడం, తెలంగాణతో పోలిస్తే ధరలో కూడా పెద్దగా తేడా లేకపోవడం, కొన్ని బ్రాండ్లు మనకంటే అక్కడే తక్కువ ధరకు దొరుకుతుండడంతో ఇక్కడ సేల్స్ తగ్గిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా అమ్ముడయ్యే బ్రాందీ క్వార్టర్ బాటిల్ రూ.130 ఉండగా, ఇదే బ్రాండ్ ఏపీలో రూ.120కే అమ్ముతున్నారు. ఇక చీప్ లిక్కర్ ను రూ.99కే క్వార్టర్ బాటిల్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. దీంతో గతేడాది వరకు ఎప్పుడూ జాతరను తలపించేలా ఉండే ఎర్రుపాలెం వైన్ షాప్ దగ్గర ప్రస్తుతం రష్​ బాగా తగ్గిపోయిందని ఎక్సైజ్ ఆఫీసర్లే ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారు.

ఈ ఏడాది రూ. 200 కోట్ల  మేరకు తగ్గిన సేల్స్ 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతేడాది డిసెంబర్ నెలలో రూ.264 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది డిసెంబర్ లో రూ.228 కోట్ల మద్యం సేల్ అయినట్టు సమాచారం. లిక్కర్ సేల్స్ లో ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే రూ.36 కోట్ల తగ్గుదల కనిపిస్తుండగా, మిగిలిన ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు కలిపి దాదాపు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అమ్మకాలు తగ్గినట్టు తెలుస్తోంది. అయితే సేల్స్ తగ్గడంపై ఏపీ ప్రభావం ఉందని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారులు అనధికారికంగా అంగీకరిస్తున్నా, అధికారికంగా మాత్రం దీనిపై స్పందించడం లేదు. అయితే, వైన్ షాపుల లైసెన్స్ లు దక్కించుకున్న వారు గతేడాది డిసెంబర్ నుంచి అమ్మకాలు ప్రారంభించారని, అందుకే గతేడాది డిసెంబర్ లో ఎక్కువ స్టాక్ తీసుకోవడం వల్ల ఈ సారి అమ్మకాలు తగ్గినట్టుగా కనిపిస్తోందని చెప్పుకొస్తున్నారు.

బిజినెస్ 30% పడిపోయింది

మద్యం అమ్మకాలపై ఏపీ ప్రభావం ఉంది. మన రాష్ట్రం కంటే ఏపీలో కొన్ని బ్రాండ్లపై మాత్రమే ధర కొంచెం ఎక్కువగా ఉంది. ఆ మాత్రం ఆదా కోసం ఎందుకు అక్కడిదాకా పోవడం అని ఏపీ వాళ్లు అనుకుంటున్నారేమో. అందుకే రెండు నెలల నుంచి మన షాపుల దగ్గరకు రావడం పూర్తిగా తగ్గించేశారు. గతేడాది కంటే ఈ సారి బిజినెస్ 30 శాతం దాకా పడిపోయింది.  
- శ్రీనివాస్ రెడ్డి, వైన్ షాపు లైసెన్స్
హోల్డర్, ఖమ్మం జిల్లా