గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!

అంధ ప్రదేశ్‌లో ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. నడవలేని స్థితిలో ఇంటి దగ్గర ఉన్న ముసలోళ్లను పార్టీ కార్యకర్తలు ఎత్తుకెళ్లి నచ్చిన గుర్తుకు ఓటు వేపించుకుంటే.. మరికొన్ని చోట్ల పోలింగ్ సిబ్బందే తమకు నచ్చిన ఓటుకు గుద్దేశారు. ఆ కోవకు చేధింనదే ఈ ఘటన. తాను గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఎన్నికల సిబ్బంది ఫ్యాన్ గుర్తుకు ఓటేశారని ఓ ఓటర్ వాపోయాడు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరానికి చెందిన గుబ్బల నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓటు వేయడానికి పోలింగ్ బూత్  వద్దకు చేరుకున్నారు. ఆయన నడవలేని స్థితిలో ఉండటంతో సిబ్బంది ఆయనను బ్యాలెట్ కేంద్రంలోకి వెళ్లారు. అక్కడ తాను గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయమని చెప్తుండగానే పోలింగ్ సిబ్బంది ఫ్యాను గుర్తుకు ఓటేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అనంతరం నాగేశ్వరరావు తనకు న్యాయం చేయాలంటూ పోలింగ్ బూత్ ముందే నిరసనకు దిగారు.