
ఏపీలో ఎంసెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కాకినాడ జేఎన్‌టీయూ ఝలక్ ఇచ్చింది. ఎంసెట్ ఫలితాలను మే మూడో వారంలో వెల్లడించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం వెబ్‌సైట్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి షెడ్యూలు ప్రకారం బుధవారమే ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల రిజల్ట్స్ ను మూడు వారాలపాటు వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.