సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కృష్ణ మరణవార్త తనను కలిసివేసిందని అన్నారు. ఇండస్ట్రీలో పెద్ద చరిత్ర సృష్టించిన వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తను ఫస్ట్ టైం తేనె మనసులు సినిమా చూశానని..100 డేస్ ఫంక్షన్ కు కూడా వెళ్ళానని చెప్పారు. అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణకు మంచి పేరు తెచ్చిందని, ఎన్నో అవార్డులు వచ్చాయని అన్నారు.
అంతకు ముందు సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి చంద్రబాబు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణ మృతి సినీ ప్రపంచానికి తీరని లోటన్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ఇవ్వాలని కోరుకుకుంటున్నట్లు తెలిపారు. కృష్ణ వారసత్వాన్ని మహేశ్ బాబు ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు.