ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటినుంచి అంటే 2024 జూన్ 19వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండు రోజుల పాటు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి ఆయన పులివెందులకు వెళ్తుండటం విశేషం. 19వ తేదీ బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లి నుంచి బయల్దేరి సాయంత్రం కల్లా అక్కడికి చేరుకుంటారు.
రాయలసీమ నేతలు, కార్యకర్తలతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు, తదుపరి కార్యచరణపై పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. తిరిగి 21వ తేదీన ఆయన విజయవాడకు వెళ్లనున్నారు. మరోవైపు వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఈ నెల 19 బదులు జూన్ 22న సమావేశం నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.