ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్చల్

ప్రగతి భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు ఏపీ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. అయితే ఆయనను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అపాయింట్మెంట్ లేకుండా లోపలికి అనుమతించమని వెనక్కి పంపారు పోలీసులు. అయితే ఆయన సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్ కు వచ్చారన్నారు. దీంతో అనుమతి లేదంటూ ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. కెసిఆర్ అపాయింట్ మెంట్  కాకుంటే కెటిఆర్ ను కలుస్తానని పోలీసులతో జేసీ వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతో  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. 

 

ఇవి కూడా చదవండి

ఏపీలో 10వేలు దాటిన కరోనా కేసులు..

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీలక ప్రకటన

20వేలు ఇస్తేనే భూమి నీ పేరిట రాసిస్తా..