గుండెపోటుతో ఏపీ మాజీ మంత్రి మృతి

మాజీ మంత్రి, విజయా సంస్థ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి మరణించారు. సోమవారం హైదరాబాద్ మియాపూర్లో గుండెపోటుతో ఆమె మృతి చెందారు. సీతాదేవి ఎన్టీఆర్ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు.సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడుమూరు.ఈమె ముదినేపల్లి నుండి టీడీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

సీతాదేవి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. సీతాదేవి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు చంద్రబాబు. విస్యశాఖ మంత్రిగా సీతాదేవి తనదైన ముద్ర వేశారని కొనియాడారు చంద్రబాబు.