ప్రజలు మళ్లీ మాకు అధికారం ఇస్తారు: మాజీ సీఎం జగన్

అమరావతి: భవిష్యత్తులో తమ పార్టీకి ప్రజలు అధికారం ఇస్తారని నమ్మకం ఉందని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి  ఉన్నారు. లోక్ సభ, రాజ్య సభ ఎంపీలతో సమావేశం అయిన జగన్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికల్లో పోలైన ఓట్లలో 40 శాతం ఓట్లను వైసీపీకి వచ్చాయని గుర్తు చేశారు. 2019 ఎన్నికలతో పోలిస్తే పార్టీ కేవలం 10 శాతం ఓట్లను మాత్రమే కోల్పోయిందన్నారు. త్వరలో వైసీపీ, టీడీపీ ప్రభుత్వాల మధ్య తేడాలను ప్రజలు గుర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సమయం వేగంగా గడిచిపోతుంది.. 2014 నుంచి 2019 వరకు నాయుడుగారి పదవీకాలం తనకు పెద్దగా గుర్తు లేదని, టిడిపి అధినేత ప్రస్తుత పదవీకాలం కూడా అదే విధంగా గడిచిపోతుందని మాజీ సిఎం అన్నారు. పార్లమెంటులో తన పార్టీ బలం గురించి మాట్లాడుతూ..ప్రతిపక్షంలో భాగమైన తన పార్టీని ప్రస్తావిస్తూ వైఎస్సార్‌సీపీకి 11 మంది రాజ్యసభ ఎంపీలు, నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారని హైలైట్ చేశారు. అందుకే  మా పార్టీ కూడా చాలా బలమైంది.మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని వైఎస్ జగన్ అన్నారు.రాష్ట్ర, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల తరపున ధైర్యంగా పోరాడాలని ఎంపీలను ఆదేశించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, పి మిథున్ రెడ్డి, పరిమల్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఎం గురుమూర్తి, బీద మస్తాన్‌రావు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్ల బాబూరావు, ఎస్ నిరంజన్‌ రెడ్డి, మేడా రఘునాధరెడ్డి, డాక్టర్ చెట్టి తనూజరాణి పాల్గొన్నారు.