Ap News: భారీగా డీఎస్పీలు బదిలీ... ఎంతమంది అంటే..

ఏపీలో భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.  కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన సర్కారు.. ఈ రోజు ( జులై 31) 96 మంది  డీఎస్పీలను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో 57 మంది డీఎస్పీలు హెడ్ క్వార్టర్స్ కు రిపోర్టు చేయాలంటూ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

మొత్తంగా 96 మందిని డీఎస్పీలను బదిలీ చేయగా.. వీరిలో పలువురు వివాదరహితమైన వ్యక్తులకు డీఎస్పీలు, ఇతర విభాగాల అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మిగతా 57 మందిని మాత్రం హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలంటూ వారికి సూచించింది. బదిలీ అయిన డీఎస్పీ అధికారుల్లో సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ తోపాటు ఇతర పలు విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు.