అమరావతి: పుష్ప-2 టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతించింది. ఆంధ్రాలో కూడా ఒకరోజు ముందే డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు పుష్ప ప్రీమియర్ షోస్ ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రీమియర్ షో టికెట్ రేటు రూ.800కు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 వరకు మల్టీప్లెక్స్లో టికెట్ రేట్ కంటే రూ.200 అధికంగా హైక్ కు పర్మిషన్ లభించింది. సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాస్కు రూ.150, లోయర్ క్లాస్కు రూ.100 అధికంగా పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది.
Also Read : విడుదలకు ముందు తెలంగాణలో పుష్ప-2కు ఊహించని కష్టం
ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అంగీకరిస్తూ జీవో ఇవ్వడంతో అల్లు అర్జున్ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ నిర్ణయం రెండు రోజుల క్రితమే తీసుకున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అధికారికంగా ప్రకటించడం ఆలస్యమైందని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. మంగళవారం నుంచి బుక్ మై షో, డిస్ట్రిక్ట్, పేటీఎంలో పుష్ప-2 టికెట్లు ఏపీలో కూడా అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్ లో పుష్ప-2 కనీవినీ ఎరుగని షోస్తో విడుదల కాబోతోంది.