శనివారం మరణించిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు రామోజీ ఫిలిం సిటీలోని ఆయన నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభయ్యింది. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు జరగనున్నాయి.ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు అంతిమ యాత్ర సాగనుంది.గత కొంత అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్న రామోజీని ఈ నెల 5న హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు. ఆరోగ్యం విషమించటంతో శనివారం తెల్లవారుజామున కనుమూశారు రామోజీ.
రామోజీరావు మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు రాజకీయ, సినీరంగ ప్రముఖులంతా ఆయన భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు.ఇవాళ షూటింగ్ లు ఆపేయాలని తెలుగు సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. క్రమంలో ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.