2024 ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుండి చాలా మంది కూటమి నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ప్రకటించింది. పలు కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
మొత్తం 20కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా వారిలో టీడీపీకి చెందిన నేతలు 16, జనసేనకు చెందిన నేతలు 3, బీజేపీ చెందినవారు ఒకరు ఉన్నారు.
Also Read:-రాజమండ్రి హేవ్ లాక్ బ్రిడ్జికి 124ఏళ్ళు
ఛైర్మన్లను నియమించిన కార్పొరేషన్లు ఇవే:
వక్ఫ్ బోర్డు - అబ్దుల్ అజీజ్
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) - అనిమిని రవినాయుడు
ఏపీ హౌసింగ్ బోర్డ్ - బత్తుల తాత్యబాబు
షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR) - బొరగం శ్రీనివాసులు
మారిటైమ్ బోర్డ్ - దామచర్ల సత్య
సీడ్ ఏపీ (APలో ఉపాధి కల్పన & ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కోసం సొసైటీ) - దీపక్ రెడ్డి
20 పాయింట్ ఫార్ములా - లంకా దినకర్
మార్క్‌ఫెడ్ - కర్రోతు బంగార్రాజు
స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ - మన్నె సుబ్బారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC - మంతెన రామరాజు
పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ - నందం అబద్దయ్య
టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - నూకసాని బాలాజీ
APSRTC-చైర్మన్, APSRTC వైస్ చైర్మన్ - కొనకళ్ల నారాయణ, పిఎస్ మునిరత్నం
అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - పీలా గోవింద సత్యనారాయణ
లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - పిల్లి మాణిక్యాల రావు
AP రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి - పీతల సుజాత
మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSME DC) - తమ్మిరెడ్డి శివశంకర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ - తోట మెహర్ సుధీర్
ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC) వజ్జా బాబురావు
టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ APTIDCO - వేములపాటి అజయ్‌కుమార్