వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసేందుకు సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. సిట్ సభ్యులుగా ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస్, శ్రీహరిబాబు, డిఎస్పీ పీ. శ్రీనివాస్, సీఐ కే. శివాజీ, సీహెచ్ నాగ శ్రీనివాస్ లను నియమించింది ప్రభుత్వం.
జగన్ హయాంలో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లో అవకతవకలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్న క్రమంలో దర్యాప్తు వేగవంతం చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని డీజీపీ పంపిన ప్రతిపాదనల మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
ఈ మేరకు సిట్ అధికారులు అడిగిన నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో పాటు ప్రతి 15రోజులకు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్ ను ఆదేశించింది ప్రభుత్వం.