Ticket Prices: ఏపీలో భారీగా పెరగనున్న టికెట్టు ధరలు.. సంక్రాంతి సినిమాలకి ఎంత పెంచనుందంటే?

Ticket Prices: ఏపీలో భారీగా పెరగనున్న టికెట్టు ధరలు.. సంక్రాంతి సినిమాలకి ఎంత పెంచనుందంటే?

సినిమా (CINEMA)అంటేనే పండుగ కళ. అలాంటిది కొత్త సినిమాలు పండుగకే విడుదలైతే.. అది ఇక జాతర అన్నట్టే! ఇపుడు ఈ కొత్త ఏడాది సంక్రాంతి (Sankranthi) పండుగకి స్టార్ హీరోల సినిమాల నగారా మోగనుంది. బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలు రానున్నాయి.

ఈ మూడు ప్రాజెక్ట్స్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దేనికదే ప్రత్యేకమైన స్టోరీతో రానున్నాయి.  అయితే, అంచనాల మాట అటుంచితే.. టికెట్ల రేట్లు ఎలా ఉండనున్నాయనే సందేహం నెలకొంది.

ఇక తెలంగాణాలో బెనిఫిట్ షోలు రద్దు అయిన విషయం తెలిసిందే. టికెట్ల రేట్స్ కూడా పెంచడం కుదరదని సూటిగా తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కొత్త సినిమాల టికెట్టు ధరలు ఎలా ఉండనున్నాయి? అక్కడి గవర్నమెంట్ ఎంతవరకు రేట్స్ పెంచుకునే అవకాశం ఇవ్వ్వనుందో తెలుసుకుందాం. 

ALSO READ | SSMB 29 Launch: మహేశ్ బాబు-రాజమౌళి మూవీ లాంచ్‍కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే?

ఈ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల టికెట్ల ధరలను భారీగా పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కానున్న మూడు సినిమాల్లో.. ఒక్కో సినిమాకు ఒక్కోలా టికెట్ల ధరలు పెరగనున్నట్లు సమాచారం. అయితే, ఇక్కడ ఉన్నది ముగ్గురు స్టార్ హీరోస్ కావడంతో ఏ సినిమాకి ఎంత పెంచొచ్చనేది ఇపుడు ఆసక్తిగా మారింది. 

గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే..

దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. అందుకు తగ్గట్టుగానే టికెట్ల ధరలను భారీగా పెంచడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

సింగిల్ స్క్రీన్ లో బాల్కనీ టికెట్ ధర రూ.135, మల్టీప్లెక్స్ అయితే రూ.175 వరకు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వబోతోందట.బెనిఫిట్ షోలు అర్ధరాత్రి 1 నుంచే స్టార్ట్ కానున్నాయి. అయితే, వీటికి మాత్రం రూ.600 వరకు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

డాకు మహారాజ్:

బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ మూవీకి ఏపీలో సింగిల్ స్క్రీన్ లో రూ.110, మల్టీప్లెక్స్ లో రూ.135 వరకు పెంచుకునే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే డాకూ మహారాజ్ బెనిఫిట్ షోలు ఉదయం 4 గంటలకి న్నాయి. వీటికి మాత్రం  రూ.500 వరకు ఏపీ ప్రభుత్వం పెంచుకునే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. 

సంక్రాంతికి వస్తున్నాం: 

వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ మూవీకి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75, మల్టీప్లెక్సుల్లో రూ.100 హైక్ మాత్రమే పెంచుకునే అవకాశం దక్కినట్లు సమాచారం. ఇక ఈ రెండు సినిమాల పోలిస్తే వెంకటేష్ సినిమాకు టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నాయి. గతేడాది సంక్రాంతికి మాస్ యాక్షన్ మూవీగా వచ్చిన ‘సైంధవ్’ భారీ డిజాస్టర్ అయింది. దాంతో వెంకటేష్ ఈసారి క్లాస్ కామెడీతో వస్తున్నాడు.