ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తూ వెళ్తోంది.ఇప్పటికే మంత్రులంతా బాధ్యతలు చేపట్టిన క్రమంలో సోమవారం క్యాబినెట్ భేటీ అయ్యింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది చంద్రబాబు క్యాబినెట్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుండి పలు పథకాలకు పేర్లను మార్చింది ప్రభుత్వం.
ఇప్పటిదాకా పేర్లు మార్చిన పధకాలు:
- వైఎస్సార్ కళ్యాణమస్తు - చంద్రన్న పెళ్లి కానుక
వైఎస్సార్ విద్యోన్నతి - ఎన్టీఆర్ విద్యోన్నతి
జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం - ఇన్సెంటివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
జగనన్న విద్యా దీవెన - పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్
జగనన్న విదేశీ విద్యా దీవెన - అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి
వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ - ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్
వైఎస్సార్ రైతు భరోసా - అన్నదాత
జగనన్న విద్యా కనుక - స్టూడెంట్ కిట్ స్కీం
జగనన్న గోరుముద్ద - పీఎం ఫాషన్ గోరుముద్ద
దిశా - మహిళా పోలీస్ స్టేషన్
స్పందన - పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం ( PGRS )