పెన్షన్ల పంపిణీపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక వాలంటీర్ల చేత ఇంటింటికీ పెన్షన్ పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేయగా పెన్షన్ ఇంటింటికీ పెన్షన్ పంపిణీ నిలిపేసిన సంగతి తెలిసిందే. గత నెల పెన్షన్ ను సచివాలయాల వద్ద పంపిణి చేసిన జగన్ సర్కార్ మే నెల పెన్షన్ పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీన పెన్షన్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

బ్యాంక్ అకౌంట్ లేనివారు, దివ్యాంగులు, రోగులకు పెన్షన్లు ఇంటివద్దకే పంపిణీ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. గత నెల పెన్షన్ల పంపిణీ సమయంలో సచివాలయాల వద్ద క్యూలో నిలబడి పలువురు వృద్దులు మృతి చెందగా ఎండ తీవ్రతకు చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.