అవ్వ తాతలకు గుడ్ న్యూస్: ఆగస్టు నెల పెన్షన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 

అవ్వ తాతలకు గుడ్ న్యూస్: ఆగస్టు నెల పెన్షన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. 

ఆగస్టు నెల పెన్షన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో లాగే ఆగస్టు నెలలో కూడా ఒకటో తేదీ ఉదయం 6గంటల నుండే పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. మొదటిరోజునే 99శాతం పెన్షన్ పంపిణీ పూర్తవ్వాలని, ఏదైనా కారణాల చేత పెన్షన్ అందని వారికి మరుసటిరోజు పంపిణీ చేయాలని ఆదేశించింది. 31వ తేదీ నాడే బ్యాంకుల నుండి పెన్షన్ కి సంబందించిన డబ్బు డ్రా చేయాలని ఆదేశించింది.

పింఛన్ పంపిణీలో నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపైన కఠినచర్యలు తప్పకుండా ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, లబ్ధిదారులంతా ఆగస్టు ఒకటవ తేదీ నాటికి తమ స్వగ్రామాల్లో ఉండాలని అధికారులు సూచించారు. సెర్ప్ సీఈవో ఈ మేరకు కీలక సూచనలు చేశారు. పింఛన్లు  పంపిణీ కోసం నియమించబడినసిబ్బంది ఆగస్టు 1వ తేదీన 6గంటలకే పంపిణీని ప్రారంభిస్తారని తెలిపారు.

మొదటి రెండు రోజుల పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాలలో ప్రెస్ మరియు సోషల్ మీడియా తో పాటు బహిరంగ ప్రదేశాలలో చాటింపు ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని.. ప్రతి లబ్ధిదారునికి సమాచారం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.