ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు..

డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది.

ఎన్నికల తర్వాత ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేశారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ను ప్రభుత్వం రద్దు చేసింది.మరో రెండు, మూడు రోజుల్లో  16,347 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ జారీకానున్నట్లు తెలుస్తోంది.