నిన్న వాలంటీర్లు.. నేడు రేషన్ వాహనాలు.. ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం..

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తోంది.ఇప్పటికే పలు పథకాలకు పేర్లు మార్చిన ప్రభుత్వం, పెన్షన్ పంపిణీ విషయంలో వాలంటీర్లను పక్కన పెడుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది  కూటమి ప్రభువం.గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టింది. రేషన్ పంపిణీ వాహనాలకు స్వస్తి పలికిన ప్రభుత్వం మళ్ళీ పాత రేషన్ షాపుల విధానాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు.

గిరిజన ప్రాంతాల్లో ఉన్న 962 రేషన్ పంపిణీ వాహనాలను నిలిపివేస్తూ, పాత రేషన్ షాపుల పద్దతిని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు సంధ్యారాణి. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎండీయూ యూనిట్ల ద్వారా రేషన్ పంపిణి నిలిపివేస్తున్నట్లు తెలిపారు మంత్రి సంధ్యారాణి.ప్రభుత్వ తాజా నిర్ణయంతో గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికీ రేషన్ పంపిణీ నిలిచిపోనుంది.