ఏపీలో 8,415 టెస్టులు.. 62 కొత్త కేసులు

ఏపీలో 8,415 టెస్టులు.. 62 కొత్త కేసులు

అమరావతి, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,415 శాంపిల్స్ టెస్టు చేయగా 62 మందికి పాజిటివ్ వచ్చింది. కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయారు. ఇప్పటివరకు 2,514 కేసులు నమోదయ్యాయని, మృతుల సంఖ్య 55కు చేరిందని ఏపీ హెల్త్ డిపార్ట్ మెంట్ శుక్రవారం బులెటిన్ లో పేర్కొంది. ఇప్పటివరకు 1,731 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 728 మందికి ట్రీట్ మెంట్ కొనసాగుతున్నట్లు తెలిపింది.

మైగ్రెంట్స్ కు బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయండి: హైకోర్టు
మైగ్రెంట్ వర్కర్స్ ను సొంతూర్లకు తరలించేందుకు ఏపీ సర్కారు తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పేర్లు రిజిస్టర్ చేసుకున్నవారి కోసం 48 గంటల్లో బస్సులు, 98 గంటల్లో రైళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వలస కూలీల కోసం అన్ని చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. వలసకూలీలు శిబిరాల్లో ఉండకుండా సొంతూర్లకు నడుచుకుంటూ ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. వలస కూలీల సమస్యలను మానవతా దృక్పథంతో చూడాలంది.

For More News..

రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

పడిపోయిన టమాట రేటు