అమరావతి: కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం కాస్త సడలింపులతో ఈనెల 20 వరకు లాక్ డౌన్ పొడిగించింది. కర్ఫ్పూ ఆంక్షలు ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే సడలింపు ఉండేది. తాజాగా మరో రెండు గంటలు ఆంక్షలు సడలించారు. రేపటి నుంచి ప్రజల రాకపోకలు, దుకాణాలు తెరచుకునేందుకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.మధ్యాహ్నం 2 నుండి మరుసటి రోజు ఉదయం వరకు కర్ఫ్యూ యధాతధంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గతంలో ఉన్న కరోనా నిబంధనలు యధాతథంగా అమలులో ఉంటాయి. అంటే మాస్కు ధరించడం.. సోషల్ డిస్టెనస్ (సామాజిక దూరం) పాటించడం తప్పనిసరి. అంతేకాదు పెళ్లిళ్లకు 40 మందికి, ఇతర ఫంక్షన్లకు 20 మందికి మాత్రమే అనుమతి. చావులు, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి. ఈ నిబంధనలు కచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రభుత్వం సూచించింది.