ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ మరోవారం పొడిగింపు

ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ మరోవారం పొడిగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను మరో వారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా మహమ్మారి నివారణలో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కొత్త కొత్త వేరియంట్ల కారణంగా కేసులు పెరుగుతున్న సూచనలు గుబులు పుట్టిస్తున్న నేపధ్యంలో కరోనా ఆంక్షలు యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 21వ తేదీ వరకు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. దుకాణాలు, మాల్స్  రాత్రి 9 గంటలకే మూసివేయాలని..జనం 10 గంటలకల్లా ఇళ్లకు చేరుకోవాలని, కరోనా ప్రోటోకాల్ నిబంధనలు తప్పనిసరిగా అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.