అమరావతి: దేశంలో కరోనా కేసులు రోజుకోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 1.79 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా 4 వేలు దాటాయి. భారత్ లో సెకండ్ వేవ్ టైమ్ లో తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాలు పక్క రాష్ట్రాల స్టీల్ ప్టాంట్ల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొచ్చాయి. దీంతో అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. మళ్లీ కరోనా విజృంభిస్తే ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలనే ఆలోచనతో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, వాటి సంఖ్యను పెంచడంపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘జగనన్న ప్రాణవాయువు’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
♦ప్రభుత్వాసుపత్రిలోప్రాణవాయువుకు కొరతలేకుండా ఉండేలా ‘జగనన్న ప్రాణవాయువు’ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 10, 2022
♦50 అంతకన్నా ఎక్కువ పడకలున్న ప్రతి ప్రభుత్వాసుపత్రిలో గాలి నుంచి మెడికల్ ఆక్సిజన్ తయారుచేసే ప్రెజర్ స్వింగ్ అడ్సార్పషన్ ప్లాంట్లు ఏర్పాటుచేసింది. pic.twitter.com/V7FkYX6EjV
ఏపీలో 50 అంతకన్నా ఎక్కువ పడకలున్న ప్రతి ప్రభుత్వాసుపత్రిలో గాలి నుంచి మెడికల్ ఆక్సిజన్ తయారుచేసే ప్రెజర్ స్వింగ్ అడ్సార్పషన్ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రూ.189 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన 144 ఆక్సిజన్ ప్లాంట్లను ఇవాళ సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ప్లాంట్ల ద్వారా నిమిషానికి నిమిషానికి 44 వేల లీటర్ల మెడికల్ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయొచ్చు.
మరిన్ని వార్తల కోసం: