13 రోజులు దసరా సెలవులు ఇచ్చిన ఏపీ సర్కార్

ఏపీలో  స్కూళ్లకు దసరా సెలవులను ఖరారు చేశారు. 2023 అక్టోబర్ 13 నుంచి 25 వరకు అంటే 13 రోజుల పాటు దసరా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు విద్యా శాఖ అధికారులు షెడ్యూల్ ను విడుదల చేశారు. ఎస్ఏ-1 పరీక్షలు అక్టోబర్ 5 నుంచి 11 వరకు జరగనున్నాయి. 8వ తరగతి మినహా మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పూటే పరీక్షలను నిర్వహించనున్నారు. 

గత ఏడాది ఎస్ఏ-1, ఎస్ఏ-2 పరీక్షలతో పాటు అంతకుముందు సంవత్సరాల్లో త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షల నిర్వహణలో సరి-బేసి విధానాన్ని అమలు చేశారు. ఉదయం పూట 6, 8, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలను నిర్వహిస్తే, మధ్యాహ్నం 7, 9వ తరగతుల విద్యార్థులకు పరీక్షలను నిర్వహించేవారు. తద్వారా విద్యార్థులకు సీటింగ్ ఏర్పాట్లను చేయడానికి అవకాశం ఉండేది. 

అయితే తాజాగా విడుదల చేసిన ఎస్ఏ-1 పరీక్షల టైమ్ టేబుల్ ప్రకారం ఒక్క 8వ తరగతి మినహా మిగిలిన అన్ని తరగతులకూ ఉదయమే పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ఎస్ఏ-1 పరీక్షలు ముగిసిన వరకు సెలవులు కొనసాగుతాయి. అక్టోబర్  26 నుంచి పాఠశాలలు తిరిగి  ప్రారంభమవుతాయి.