‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని తెలిపారు. అయితే.. మొదటి 10 రోజులు మాత్రమే సినిమా టికెట్ల ధరలు పెంచుకోవాలని, ఆ తర్వాత పాత రేట్లకే టికెట్లు అమ్మాలని తెలిపారు. హీరో హీరోయిన్ల రెమ్యూనేషన్లు కాకుండా వంద కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చిన తెలిపారు.
For More News..