ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్మిస్తోన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు పర్యావరణ అనుమతులు ఇప్పటికీ రాలేదు. అయినా ఏపీ సర్కార్ మాత్రం ప్రాజెక్టు నిర్మాణాన్ని స్పీడప్ చేసింది. కేవలం డ్రింకింగ్ వాటర్ కోసమే ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్తున్నది. అందుకు అనుగుణంగా గతేడాది ఆగస్టు 11న జీవో 364 జారీ చేసింది. ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2 కింద విభజించామని. ప్రస్తుతం ఫేజ్ 1 పనులు డ్రింకింగ్ వాటర్ కోసమే చేస్తున్నామని వా దిస్తున్నది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ముసుగులో ఫేజ్ 1 పనులను చేస్తున్న ఏపీ.. పనిలోపనిగా ఇరిగే షన్ అవసరాలను తీర్చే ఫేజ్ 2 పసులనూ మొదలు పెట్టేసింది.
ఇప్పటికే ప్రాజెక్టులో భాగమైన పంప్ హౌస్ నిర్మాణ పనులు 87 శాతం పూర్తి చేసింది. నీటిని తరలించే స్థానం నుంచి పంప్ హౌస్ వరకు అప్రోచ్ చానెల్ పనులనూ 14.13 శాతం పూర్తి చేసింది. అప్రోచ్ చానెల్లో 4.59 కోట్ల క్యూబిక్ మీటర్ల వర్త్ వర్క్ పనులను చేయాల్సి ఉండగా, 64.97 లక్షల క్యూబిక్ మీటర్ల పని కంప్లీట్ చేసింది. పంప్ హౌస్ కు మొత్తం 27 లక్షల క్యూబిక్ మీటర్ల పని చేయాల్సి ఉండగా, 23.49 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తి చేసేసింది. మరో 3.50 లక్షల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే పెండింగ్లో ఉంది.