- కనిష్టంగా రూ. 20, గరిష్ట ధరగా రూ.250 ఖరారు
అమరావతి: రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ల ధరలపై ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పరిధిలోని థియేటర్లకు వేర్వేరుగా ధరలు ఖరారు చేస్తూ జీవో ఇచ్చింది. కొత్త జీవో ప్రకారం జీఎస్టీని మనిహాయించి సినిమా టికెట్ కనిష్ట ధర రూ.20 నుంచి మొదలు గరిష్ఠంగా రూ.250 గా ఖరారు చేసింది.
సినిమా థియేటర్లు దోపిడీ చేస్తున్నాయని.. బ్లాక్ టికెట్ల దందా నడుస్తుండడాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తూ.. బెనిఫిట్ షోలకు.. భారీ సినిమాలకు ప్రత్యేక ధరలు ఖరారు చేసుకోవడాన్ని ప్రభుత్వం అంగీకరించని విషయం తెలిసిందే. థియేటర్ల యాజమాన్యాలే కౌంటర్లలో నామమాత్రంగా టికెట్లు ఇచ్చి మెజారిటీ టికెట్లు నేరుగా బ్లాక్ లో అమ్ముకుంటోందన్న ఆరోపణలు నేపథ్యంలో పెద్ద హీరోల కొత్త సినిమాల రోజున గట్టి నిఘా నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. సినీ పెద్దలు స్పందించి విజయవాడకు వెళ్లి పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ధరలు
నాన్ ఏసీ థియేటర్లలో ధరలు: రూ.40 నుంచి రూ.60
ఏసీ థియేటర్లలో ధరలు: రూ.70 నుంచి రూ.100
స్పెషల్ థియేటర్లలో ధరలు: రూ.125 నుంచి రూ.150
మల్టీ ప్లెక్స్ లలో: కనీస ధర రూ.125, రెగ్యులర్ సీట్ల ధర: రూ.150 రిక్లైనర్ సీట్ల (పడుకునే కుర్చీలు) ధర: రూ.250
మున్సిపాలిటీ పరిధిలో ధరలు
నాన్ ఏసీ థియేటర్లలో ధరలు: రూ.30 నుంచి రూ.50
ఏసీ థియేటర్లలో ధరలు: రూ.60 నుంచి రూ.80
స్పెషల్ థియేటర్లలో ధరలు: రూ.80 నుంచి రూ.100
మల్టీ ప్లెక్స్ లలో: కనీస ధర రూ.100, రెగ్యులర్ సీట్ల ధర: రూ.125 రిక్లైనర్ సీట్ల (పడుకునే కుర్చీలు) ధర: రూ.250
నగర పంచాయతీల పరిధిలో
నాన్ ఏసీ థియేటర్లలో ధరలు: రూ.20 నుంచి రూ.40
ఏసీ థియేటర్లలో ధరలు: రూ.50 నుంచి రూ.70
స్పెషల్ థియేటర్లలో ధరలు: రూ.80 నుంచి రూ.100
మల్టీ ప్లెక్స్ లలో: కనీస ధర రూ.90, రెగ్యులర్ సీట్ల ధర: రూ.100 రిక్లైనర్ సీట్ల (పడుకునే కుర్చీలు) ధర: రూ.250.
థియేటర్ల నిర్వహణ కోసం నాన్ ఏసీకి రూ.3, ఏసీ ఉన్న వాటికి రూ.5 వసూలు చేయవచ్చని.. అలాగే జీఎస్టీ కాకుండా ఈ ధరలు వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
మరో ఎన్నికల సమరానికి తెరలేపిన ఎలక్షన్ కమిషన్
తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్డేట్స్
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్
మేడారం జాతర హుండీల లెక్కింపు పూర్తి.. మొత్తం ఎంత వచ్చిందంటే