ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది.. ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులో కూడా విడుదల చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం.ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ ఉత్తర్వులు విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని, 90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో కూడా ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకం అని పేర్కొంది. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఏపీలో ప్రభుత్వ తాజా నిర్ణయం తెలుగు భాషా సమగ్రతకు తోడ్పడుతుందని పేర్కొంది ప్రభుత్వం.
ఇక మీదట ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది సాధారణ పరిపాలన శాఖ. ఇంగ్లీష్ లో ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత రెండు రోజుల్లోగా తెలుగులోనూ అదే ఉత్తర్వు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించింది సాధారణ పరిపాలన శాఖ.
ఈ మేరకు ఉత్తర్వులు తెలుగులో విడుదల చేసేందుకు గాను డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది సర్కార్. తెలుగులో కూడా ఉత్తర్వులు జారీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.