కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్..! 

కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో 2014 కు ముందు నుండి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 2146 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యూలరైజ్ అయ్యారు. వీరిలో పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 2025 మంది, డీఎంఈ పరిధిలో 66మంది, కుటుంబ సంక్షేమ విభాగంలో 55మంది, ఆయుష్, యునాని విభాగాలలో నలుగురు ఉద్యోగులు ఉన్నారు.

ALSO READ :- ఏపీలో ఒంటిపూట బడులు ఆ రోజు నుంచే..

2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ క్రమంలో మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందే జగన్ సర్కార్ వైఎస్సార్ చేయూత కింద మహిళలో అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళా సాధికారతే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.