చంద్రన్న Good News : తల్లికి 15 వేల రూపాయలపై మార్గదర్శకాలు విడుదల

చంద్రన్న Good News : తల్లికి 15 వేల రూపాయలపై మార్గదర్శకాలు విడుదల

ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం అమలుకు సిద్ధమైంది. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి గాను తల్లుల అకౌంట్లో 15వేలు జమ చేయనుంది.ఇందుకోసం మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం.ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే ఆధార్ తప్పనిసరి అని, ఆధార్ లేనివారు తప్పకుండా నమోదు చేసుకోవాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : వైసీపీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్.. కీలక నేతలకు ముందస్తు బెయిల్.. 

ఆధార్ కార్డు వచ్చే వరకు, పాన్ కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ, వంటి 10ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి సమర్పించాలని తెలిపింది విద్యాశాఖ.దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తల్లులకు ప్రతి ఒక్కరికీ 15వేలు అకౌంట్లో జమ చేయనుంది. దీంతో పాటుగా స్టూడెంట్ కిట్ లో బ్యాగ్, దుస్తులు తదితర వస్తువులు అందించనుంది ప్రభుత్వం.