ఎంజాయ్ చేయండి : ఏపీలో సూర్యలంక, రామాపురం బీచ్ మళ్లీ ఓపెన్

ఇటీవల చీరాల, రామాపురం, సూర్యలంక బీచ్ లలో కొంత మంది యువకులు గల్లంతైన సంగతి తెలిసిందే. అప్పటి నుండి సూర్యలంక బీచ్ లో యాత్రికులను అనుమతించడం నిషేధించింది ప్రభుత్వం. తాజాగా ఈ నిషేధాన్ని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఉత్తర్వులు జారీ చేశారు.సూర్యలంక బీచ్ లో జులై 10, 2024 ( బుధవారం ) నుంచి సందర్శకులను అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు.  

ఈ క్రమంలో సందర్శకులు సూర్యలంక బీచ్ ని సందర్శించవచ్చని, అయితే... ఎవరు కూడా మద్యం సేవించి సముద్రంలోకి వెళ్లకూడదని సూచించారు అధికారులు. మద్యం సేవించి సముద్రంలోకి వెళ్ళటం ప్రమాదకరమని, యాత్రికులు లోతుకు వెళ్లకుండా పోలీసు అధికారులు చెప్పే సూచన సలహాలను పాటించాలని కోరారు.బీచ్ లో ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లాలని కోరారు అధికారులు.