వాలంటీర్లను కొనసాగించటం లేదు : షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

వాలంటీర్లను కొనసాగించటం లేదు : షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

వాలంటీర్ల అంశంపై ఏపీ  శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల వాడి వేడి చర్చ జరిగింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లు రూ. 10 వేలు జీతం ఇచ్చి కొనసాగిస్తామని చెప్పిన కూటమి సర్కార్.. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా వాలంటీర్ల ఉద్యోగాలను రెన్యువల్ చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు వాలంటీర్లు. ఈ అంశాన్ని వైసీపీ మండలిలో లేవనెత్తగా.. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి క్లారిటీ ఇచ్చారు.  ప్రస్తుతం వాలంటీర్లు ఎవరూ పనిచేయట్లేదని.. 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు మంత్రి స్వామి. 

ఆగస్టు తర్వాత వాలంటీర్ల పొడిగింపునకు గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని.. తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే క్రమబద్ధీకరించేవాళ్లమని అన్నారు. 2023 ఆగస్టు వరకే జీవో రిలీజ్ చేసిన వైసీపీ..  ఇప్పుడేమో వాలంటీర్లపై మొసలి కన్నీరు కారుస్తోందని అన్నారు. మంత్రి ప్రకటనతో వాలంటీర్లకు మరోసారి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి.

Also Read:-వాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఎప్పుడు.. జున్ను, స్వీట్లతో రెడీగా ఉన్నారు

ఇదిలా ఉండగా.. వాలంటీర్ల కొనసాగింపు అంశంపై కూటమి ప్రభుత్వానికి చురకలంటించారు వైసీపీ ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్ వరుదు కళ్యాణిలు. తమకు రూ. 10 వేలు జీతం ఎప్పుడిస్తారని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది వాలంటీర్లు జున్ను స్వీట్లతో ఎదురుచూస్తున్నారని కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.

ఎన్నికలక ముందు ప్రచారంలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు వాలంటీర్లతో అన్న మాటలను ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు ఎమ్మెల్సీ రమేష్. గత ప్రభుత్వ హయాంలో జీవో ప్రకారం నియమించబడ్డ వాలంటీర్ల భవిష్యత్తుతో ఆడుకుంటోందని.. విజయవాడ వరదల సమయంలో వాలంటీర్ల సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం.. వాలంటీర్ వ్యవస్థనే చట్టబద్దం కాదని అంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ రమేష్