![వెరీ షాకింగ్ : జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలు వెనక్కి తీసుకోనున్న చంద్రబాబు ప్రభుత్వం](https://static.v6velugu.com/uploads/2025/02/ap-government-special-focus-on-lands-distributed-in-ys-jagans-regime_yqpMwXf0SZ.jpg)
వైసీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం.. జగన్ ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా, కొన్నా వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.అప్పట్లో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారని ఆరోపిస్తున్న కూటమి సర్కార్ ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటి ప్రభుత్వంలో ఇళ్ల స్తలాలు పొందిన అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.అనర్హులు అని తేలితే వారి ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.ఈ మేరకు ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు.
15 రోజుల్లోనే అనర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. అయితే ఇళ్ల పట్టాల రద్దుకి ప్రభుత్వం ఎక్కువ గడువు ఇవ్వకపోవడం చర్చనీయంశంగా మారింది. ఈ క్రమంలో ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలూ ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సిన పెరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారులు సరైన ఆధారాలు చూపించకపోతే ఇళ్ల పట్టాలు రద్దవుతాయని హెచ్చరిస్తున్నారు అధికారులు.
లబ్ధిదారులకు ఇవి తప్పనిసరి:
- తెల్ల రేషన్ కార్డు ఉండాలి.
- ఇళ్ల పట్టాలు పొందిన వారికి అంతకుముందే ఇల్లు లేదా స్థలం ఉండకూడదు
- ఇన్‌కం టాక్స్ చెల్లిస్తూ ఉంటే ఇంటి పట్టా రద్దు చేస్తారు
- కారు లాంటి నాలుగు చక్రాల వాహనం ఇళ్ల స్థలం రద్దు చేస్తారు
- కుల ధ్రువీకరణ పత్రం
- కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మందికి పట్టాలు ఉన్నా.. ఒకరికి మాత్రమే ఉంచి, మిగతా వారికి రద్దు చేస్తారు.( మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే అందరికీ వర్తిస్తుంది)
- ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అమ్మితే, వారికీ రద్దు చేస్తారు.
- అమ్మిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది.
వైసీపీ హయాంలో అనర్హులు చాలా మంది ఇళ్ల పట్టాలు పొందారని.. కొంతమంది ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి కూడా ఇళ్ల పట్టాలు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం. అలానే చాలా మంది పట్టాలు పొంది స్థలాల్ని ఇతరులకు అమ్మేశారని కూడా విమర్శలు ఉన్న క్రమంలో ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారింది.
ALSO READ | తిరుమల: అలిపిరి చెక్ పాయింట్ దగ్గర బారులు తీరిన వాహనాలు... ఇబ్బంది పడుతున్న భక్తులు