అవ్వ తాతలకు గుడ్ న్యూస్: ఇంటిదగ్గరే 7వేల పెన్షన్ ఇస్తారు.

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అవ్వ తాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ ను 4వేలకు పెంచిన చంద్రబాబు సర్కార్  ఎన్నికల ముందు హమీ ఇచ్చినట్లుగానే పెన్షన్ పంపిణీకి సిద్ధమైంది. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పినట్టుగానే ఏప్రిల్ నెల నుండి పెంచిన  పెన్షన్ ను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. జులై నెలలో 4వేల పెన్షన్ తో పాటుగా ఏప్రిల్ నెల నుండి నెలకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 7వేల రూపాయలను అవ్వాతాతలకు అందించనుంది ప్రభుత్వం.

వాలంటరీ వ్యవస్థను కొనసాగించనున్న నేపథ్యంలో గతంలో లగానే పెన్షన్ ఇంటి వద్దకే పంపిణీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పెన్షన్ ఫైల్ పై సీఎం చంద్రబాబు సంతకం కూడా చేసిన క్రమంలో జులై నెలలో పెంచిన పెన్షన్ లబ్దిదారులకు అందనుంది. ఇదిలాఉండగా వైఎస్సార్ భరోసా పేరుతో ఉన్న పెన్షన్ పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వం.