- ఈనెల 20తో ముగిసిన టీటీడీ పాలక మండలి పదవీకాలం
- కొత్త పాలక మండలి ఏర్పాటయ్యే వరకు స్పెసిఫైడ్ అధారిటీ
అమరాపతి: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలక మండలి నియామకం వచ్చే నెలలో చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రస్తుత పాలక మండలి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, సభ్యుల పదవీ కాలం ఈనెల 20వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి స్పెసిఫైడ్ అథారిటీ ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవీకాలం ముగియడంతో ట్రస్ట్ బోర్డు పదవీ కాలం కూడా ముగిసినట్లే. దీంతో కొత్త పాలక మండలి నియమించే వరకు స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేశారు. దేవస్థానం ఈవో చైర్మన్ గా, ఏఈవో కన్వీనర్ గా స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేశారు. పాలక మండలి కి ఉన్న అన్ని అధికారాలు స్పెసిఫైడ్ అథారిటీ కి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెల మొదటి వారానికి కొత్త పాలకమండలి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.