ఏపీ ప్రభుత్వం సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిందంటూ గత రెండురోజులుగా ఒక సెక్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ప్రతిపక్ష టీడీపీ తెగ వాడుకుంది. ఏపీ సచివాలయాన్ని ప్రభుత్వం హెచ్ డీ ఏఫ్సీ బ్యాంక్ లో 370కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టిందంటూ ప్రచారం చేసింది. ఎట్టకేలకు ఈ పుకార్లపై స్పందించిన ప్రభుత్వం వాటిలో నిజం లేదని స్పష్టం చేసింది.
‘తాకట్టులో సచివాలయం’ శీర్షికతో 03–03–2024న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన వార్త పూర్తిగా అవాస్తవం. ఈ కథనాన్ని స్వయంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖండించింది.
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) March 5, 2024
‘‘సచివాలయ భవనాలను తాకట్టు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రూ.370 కోట్లు రుణం తీసుకుంది’ అంటూ… pic.twitter.com/D6tcC7e8Ic
‘తాకట్టులో సచివాలయం’ శీర్షికతో 03–03–2024న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన వార్త పూర్తిగా అవాస్తవం. ఇలాంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించినందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయటం జరుగుతుంది.
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) March 3, 2024
– రాష్ట్ర సచివాలయంలోని అయిదు భవనాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తాకట్టు… pic.twitter.com/9R7tpfYrPc
ఈ అంశంపై గత రెండు రోజులుగా రచ్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నాని చేసిన ఘాటు వ్యాఖలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సచివాలయాన్ని తహకట్టు పెట్టొద్దని రాజ్యాంగంలో రాసి ఉందా అంటూ నాని చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం ‘తాకట్టులో సచివాలయం’ శీర్షికతో ఒక దినపత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని.
ALSO READ :- సీఎం రేవంత్ తో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ
ఈ కథనాన్ని స్వయంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖండించిందని తెలిపింది.ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని. దీన్ని మేం ఖండిస్తున్నాం’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధికార ప్రతినిధి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.దీనికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా చూడవచ్చని తెలిపారు.