సీనియర్ ఐఏఎస్‌ ప్రశాంతికి పోస్టింగ్‌ ఇచ్చిన ఏపీ సర్కార్

సీనియర్ ఐఏఎస్‌ ప్రశాంతికి పోస్టింగ్‌ ఇచ్చిన ఏపీ సర్కార్

తెలంగాణ కేడర్ నుండి రిలీవ్ అయ్యి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారిని ప్రశాంతికి చంద్రబాబు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రశాంతిని ఏపీ ప్రభుత్వం అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీరబ్ ప్రసాద్ కుమార్ 2024, అక్టోబర్ 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి రేపు (అక్టోబర్ 21) ప్రశాంతి బాధ్యతలు స్వీకరించనున్నారు. 

కాగా, తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ ఐఏఎస్‎లను తిరిగి సొంత స్టేట్ ఆంధ్రప్రదేశ్‎కు వెళ్లాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో పని చేస్తోన్న నలుగురు ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ క్యాట్‎ను ఆశ్రయించగా అక్కడ ఊరట దక్కలేదు. క్యాట్‎లో అనుకూల ఫలితం రాకపోవడంతో తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

Also Read :- సీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ

తెలంగాణ హైకోర్టులోనూ ఐఏఎస్ అధికారులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. డీవోపీటీ ఆదేశాల మేరకు ఐఏఎస్‎లు సొంత కేడర్ స్టేట్‎కు వెళ్లి రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. చేసేదేమి లేక ఐఏఎస్‎ అధికారులు ఆంధ్రప్రదేశ్‎లో రిపోర్ట్ చేశారు. అందులో ఐఏఎస్ ప్రశాంతి ఒకరు. ఈ క్రమంలోనే ఏపీలో రిపోర్టు చేసిన ప్రశాంతికి తాజాగా ఏపీ సర్కార్ పోస్టింగ్ ఇచ్చింది.