టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ రోజుకో వివాదం చుట్టుముడుతోంది. అయితే ఇప్పటికే వ్యూహం సినిమాలో పలువురు టీడీపీ నేతల ఫోటోలు ఉపయోగించి వ్యంగంగా చూపించారని కేసు నమోదు చేశారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ కేసు విచారణకి హాజరు కావడం లేదు. దీంతో ఈ కేసుని మరింత లోతుగా పోలీసులు, ప్రభుత్వం విచారిస్తోంది. ఈ క్రమంలో మరోసారి ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మకి షాక్ ఇచ్చింది.
అయితే రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాని ఏపీలో ప్రసారం చెయ్యడానికి ఏపీ ఫైబర్ కి విక్రయించింది. ఈ క్రమంలో ఈ సినిమాకి వ్యూస్ లేకపోయినప్పటికే రూ. 1.15 కోట్లు చెల్లించినట్లు కనుగొన్నారు. దీంతో ప్రభుత్వం వ్యూహం చిత్ర యూనిట్ కి ఈ సొమ్ము వడ్డీతో సహా చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. ఒకవేళ 15 రోజుల్లో ఈ డబ్బు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చినీయాంశం గా మారింది. కానీ ఇప్పటివరకూ రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం.