![ఏపీ ప్రభుత్వ సలహాదారుగా సినీ నటుడు అలీ](https://static.v6velugu.com/uploads/2022/10/AP-Govt-issued-an-order-appointing-the-famous-comedian-Ali-as-the-Electronic-Media-Adviser_4YO38zJirj.jpg)
విజయవాడ: ప్రముఖ హాస్యనటుడు అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుడిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
సలహాదారుగా బాధ్యతలు చేపట్టే అలీకి కల్పించే జీతభత్యాలు, ఇతర అలవెన్సుల గురించి విడిగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సలహాదారులందరి మాదిరిగానే అలీకి జీత భత్యాలు వర్తింప చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల ముందు అలీ వైసీపీ పార్టీలో చేరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అలీకి కీలకమైన పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.