నాగార్జున సాగర్ డ్యామ్ మరమ్మతులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యామ్ మరమ్మతులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.ఈ మేరకు ఫిబ్రవరి16న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్యామ్ మరమ్మతులపై అభ్యంతరం తెలుపుతూ.. ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది. వర్షాకాలానికి ముందు తెలంగాణ ప్రభుత్వం డ్యామ్ మరమ్మతులు చేపట్టింది. 

ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో కేఆర్ఎంబీ బోర్డ్  రంగంలోకి దిగింది. ఇవాళ, రేపు (ఫిబ్రవరి 22, 23) డ్యామ్‌ను కేఆర్ఎంబీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వరలక్ష్మి, అధికారుల బృందం పరిశీలించనున్నారు.