
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఏపీ ప్రభుత్వ షోకాజ్ నోటీసులు జరీ చేసింది. అయితే 2003 లో అప్పటి ప్రభుత్వం విశాఖలో సినీ స్టూడియో నిర్మాణం నిమిత్తం సురేష్ ప్రొడక్షన్స్ కు కేటాయించిన 34.44 ఎకరాల స్థలం కేటాయించింది. దీంతో ఇందులోని15.17 ఎకరాలను రెసిడెన్షియల్ ప్లాట్లుగా మార్చడానికి 2023లోనే సురేష్ ప్రొడక్షన్స్ అధికారులు దరఖాస్తు చేసుకొన్నారు.
గౌరవ సుప్రీంకోర్ట్ 2024లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో... 2003 లో స్థలం కేటాయించేప్పుడు ఇచ్చిన జీవో నెం:963లో పొందుపరచిన నియమనిబందనలను పాటించాలని, ఎటువంటి మార్పులు చేయవద్దని స్పష్టం చేసింది. దీంతో CCLA Spl CS, RP సిశోడియా 15.17 ఎకరాలపై చట్టప్రకారం చర్యలు తీసుకొని, సురేష్ ప్రొడక్షన్స్ కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని విశాఖ కలెక్టర్ ను ఆదేశించారు.