PRC GOలపై పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

PRC GOలపై పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త పీఆర్సీ జీవోలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్ పై  వచ్చే సోమవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించారంటూ కోర్టులో ఏపీ ఉద్యోగ  జేఏసీ నేత కేవీ కృష్ణయ్య పిటిషన్‌ దాఖలు చేశారు.

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం బెనిఫిట్స్ తగ్గకూడదని కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు సెక్షన్ 78(1)కి విరుద్ధంగా ఉన్నాయని.. కాబట్టి  జీవోని రద్దు చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం, ఫైనాన్స్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలు.. కేంద్ర ప్రభుత్వంతోపాటు పే రివిజన్ కమిషన్‌ను ప్రతివాదులుగా చేర్చారు.

 

ఇవి కూడా చదవండి

ఆన్​లైన్​ అడిక్షన్.. పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ తోపాటు ఆరుగురికి కరోనా

ఆస్కార్ రేసులో రెండు సౌతిండియన్ సినిమాలు

విశ్లేషణ: నేర చరితులను రాజకీయాల నుంచి వెలి వేయాలి