Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊరట.. కేసు విచారణపై హైకోర్టు స్టే

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊరట.. కేసు విచారణపై హైకోర్టు స్టే

ఏపీ హైకోర్టులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊరట లభించింది. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై వచ్చిన ఫిర్యాదులతో గుంటూరు సీఐడీ అధికారులు వర్మను విచారణకు రావాలని (మార్చి 5న) నోటీసులు జారీ చేశారు.

దాంతో సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించగా, నమోదైన కేసు విచారణపై (మార్చి 6న) హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. 2019 లో తెరకెక్కిన సినిమాపై 2024లో కేసులు నమోదు అవ్వడం ఏంటనీ వాదనలు విన్న న్యాయమూర్తి ప్రశ్నించారు.

హైకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో రామ్ గోపాల్ వర్మకు కాస్తా ఉపశమనం లభించింది. అయితే, తనపై నమోదైన FIR పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే చేశారని, దీన్ని కొట్టేయాలని రామ్ గోపాల్ వర్మ హై కోర్టును ఆశ్రయించడం జరిగింది.

2019 లో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అనకాపల్లి, మంగళగిరి, ఒంగోలులో కేసులు నమోదయ్యాయి.