![టైగర్ నాగేశ్వరరావు టీజర్పై ఏపీ హైకోర్టు సీరియస్..సొసైటీకి ఏం మెస్సేజ్ ఇస్తున్నారు..](https://static.v6velugu.com/uploads/2023/08/AP-High-Court-is-serious-about-Ravi-Teja-Tiger-Nageswara-Rao-movie-teaser._biqdcxV0yG.jpg)
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja ) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. యువతలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రవితేజ నుండి.. ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న మూవీ టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageshwar Rao). రీసెంట్ గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. లేటెస్ట్ గా టీజర్ విషయంలో ఏపీ హైకోర్టు అభ్యంతరం తెలిపింది.
వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఎరుకల సామాజిక వర్గాన్ని, అలాగే స్టువర్ట్ పురం ప్రాంత ప్రజలను డైలాగ్స్ విషయంలో అవమానించేలా ఉందంటూ..చుక్కా పాల్‌రాజ్ హైకోర్టులో పిల్ వేశారు. దీంతో పిటిషనర్ తరుపు అడ్వకేట్స్ వారి వాదనలు వినిపించారు. అడ్వకేట్స్ వాదనలు విన్న హై కోర్ట్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం టైగర్ నాగేశ్వర రావు మూవీ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్‌కు నోటీసులు జారీచేసింది.
అసలు ఈ మూవీకి సంబంధించి సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికెట్((సీబీఎఫ్‌సీ) లేకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. అలాగే టీజర్ లో వాడిన డైలాగ్స్ మార్చాలంటూ..ఈ లాంటి టీజర్ నుంచి సొసైటీ కి ఎటువంటి మెస్సేజ్ ఇవ్వాలనుకున్నారో వివరణ ఇవ్వాలంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే తదుపరి విచారణకి నాలుగు వారాలు గడువు ఇచ్చింది. దీంతో ముంబై సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్‌పర్సన్ కూడా ఇన్వాల్వ్ చేయాలనీ పేర్కొన్నదని సమాచారం. ఇక మరిన్ని వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే
ఇక 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవడ్ బ్యూటీ నుపుర్ సనన్(Nupur saono) హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మురళి శర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.