స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలిగారు. ఈ పిటిషన్ దసరా పండగ సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) ముందుకు అక్టోబర్ 27న విచారణకు రాగా.. ‘నాట్ బిఫోర్ మీ’ అంటూ న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో విచారణ చేపట్టలేనని స్పష్టం చేశారు. ఎవరు విచారించాలన్నది హైకోర్టు రిజిస్ట్రార్ నిర్ణయిస్తారని తెలిపారు.
విచారణ నుంచి న్యాయమూర్తి వైదొలగడంతో ఈ పిటిషన్‌ను ఏ బెంచ్ విచారించాలనే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. మరో జడ్జి ముందుకు నారా చంద్రబాబు పిటిషన్ వెళ్లనుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ అక్టోబర్ 30 వ తేదీకివాయిదా పడింది. వెకేషన్ బెంచ్ ముందు విచారణ నుంచి జస్టిస్ జ్యోతిర్మయి తప్పుకున్నారు. కంటి శస్త్ర చికిత్స కోసం చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు హైకోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. బాబు పిటిషన్ వేరే బెంచ్ విచారిస్తుందంటూ నాట్ బిఫోర్ మీ అని పేర్కొన్నారు. బాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ముందుంచాలని రిజిస్ట్రీని జస్టిస్ జ్యోతిర్మయి ఆదేశించారు. దీంతో ఈ నెల 30వ తేదీకి చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది.
ALSO READ :చంద్రయాన్ 3 రిజల్ట్: విక్రమ్ ల్యాండర్ పై ఇస్రో కీలక విషయం వెల్లడి