రాజధాని ఫైల్స్ సినిమాకు షాక్... రిలీజ్కు బ్రేక్

రాజధాని ఫైల్స్ సినిమాకు షాక్... రిలీజ్కు బ్రేక్

రాజధాని ఫైల్స్ సినిమాపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 16 వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది.  సినిమాకు సంబధించి పూర్తి రికార్డులను తమకు అందించాలని స్పష్టం చేసింది.  రాజధాని ఫైల్స్ సినిమా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

మాజీ మంత్రి కొడాలి నాని సహా మరికొన్ని పాత్రల్ని అనుచితంగా చిత్రీకరించారంటూ  పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సినిమా విడుదల ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని  హైకోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రేపటివరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది.  

ఆంధ్రప్రదేశ్ రాజధాని నేపథ్యంలో  రాజధాని ఫైల్స్‌  చిత్రాన్ని  భానుప్రకాశ్‌.  తెరకెక్కించగా..  కంఠంనేని రవిశంకర్ నిర్మించారు.   ఈ చిత్రంలో వినోద్ కుమార్,  వాణీ విశ్వనాథ్  నటించారు.   ణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు.