2024 సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన క్రమంలో సంక్షేమ పథకాలకు నిధుల విడుదల విషయంలో ఏపీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా సంకేశేమ పథకాలకు నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై ప్రభుత్వం హైకోర్టును సంప్రదించగా నిధుల విడుదలకు ఇవాళ ఒక్కరోజు సమయం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అయినప్పటికీ ఈసీ అధికారులకు అనుమతి ఇవ్వలేదు.
నిధుల విడుదల అంశంపై విచారణ జరిపిన హైకోర్టు ఈసీ వాదనతో ఏకీభవించి మే 14న నిధుల విడుదల చేయవచ్చని తెలిపింది. అయితే, కోర్టు ఆదేశాలను లెక్కచేయనందుకు గాను ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. మొత్తానికి కోర్టు ఆదేశాల తర్వాత అకౌంట్లలో డబ్బులు పడతాయని భావించిన లబ్దిదారుల ఆశల మీద ఈసీ నీళ్లు చల్లిందనే చెప్పాలి.