వైసీపీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్.. కీలక నేతలకు ముందస్తు బెయిల్..

ఏపీలో కొత్తగా కూటమి ప్రభుతం ఎరపడ్డాక అధికారుల టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజుకుంటున్న ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ దాడులకు పాల్పడుతోందంటూ వైసీపీ పలుమార్లు గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా, వైసీపీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో కీలక నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

Also Read : ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు : జూబ్లీహిల్స్ ACPకి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ లేఖ

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల, ఆర్కే, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం లకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. తదుపరి విచారణను ఈ నెల 16కు ( జులై 16, 2024 ) వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్న క్రమంలో ఈ పరిణామం వైసీపీకి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి.