
ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. సర్వీసుకు సంబంధించిన కేసులో కోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో ధర్మాసం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ బుడితి రాజశేఖర్, ఐఆర్ఎస్ రామకృష్ణకు నెల రోజు జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమాన విధిస్తూ తీర్పు చెప్పింది. అధికారులిద్దరినీ వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఇద్దరు అధికారులు కోర్టుకు క్షమాపణ చెప్పడంతో ధర్మాసనం తీర్పును సవరించింది. వారిద్దరినీ సాయంత్రం వరకు కోర్టు హాలులోనే నిలబడాలని ఆదేశించింది. ఐఏఎస్ రాజశేఖర్ గతంలో పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు ముఖ్యకార్యదర్శిగా, రామకృష్ణ ఇంటర్ బోర్డు కమిషనర్ గా పనిచేశారు.