కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై జీర్ణించుకోలేకపోతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు చూసి ఓర్వలేకనే అక్కసుతోనే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. వినుకొండలో జరిగింది వ్యక్తిగత కక్షల హత్యే అని అన్నారు. వ్యక్తిగత కక్ష హత్యపై జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బాధితుల ఇంటికి పరామర్శకు వెళ్లి వారికి భరోసా ఇవ్వాలి కానీ.. ఇలా ప్రభుత్వంపై నింద వేయడం ఎంత వరకు కరెక్ట్ అని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 45 రోజుల్లో నాలుగు రాజకీయ హత్యలు.. వీటిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలే మరణించారని స్పష్టం చేశారు. కానీ 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
హోంమంత్రిగా దీనిపై తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని జగన్‌ను కోరారు. ఒకవేళ సమాచారం ఇవ్వకపోతే జగన్ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు హోంమంత్రి అనిత.